Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : ప్రేమ పేరుతో బాలికను నమ్మించి లోబర్చుకొని గర్భవతిని చేసిన ఓ బాలుడిని నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న పదహారేళ్ల బాలికను బాలుడు ప్రేమ పేరుతో నమ్మించి గత సంవత్సరం మే నెలలో పుణేకు తీసుకెళ్లి లైంగికంగా లోబర్చుకొని గర్భవతిని చేశాడు. అప్పటి నుంచి వాళ్లిద్దరు అక్కడే కలిసి ఉంటుండగా బాలిక కుటుంబ సభ్యులు బాలిక కనిపించడం లేదంటూ నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు సదరు బాలికతో పాటు బాలుడు కూడా పుణేలో ఉన్నట్టు నిర్ధారించుకున్న నాంపల్లి పోలీసులు వీరిద్దరిని నగరానికి తీసుకొచ్చారు. బాలుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జువెనైల్ హోంకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.