Delhi | Thick layer of fog covers the national capital this morning lowering visibility. Visuals from near Akshardham. pic.twitter.com/GUkdY7jTCx
— ANI (@ANI) January 8, 2023
Authorization
Delhi | Thick layer of fog covers the national capital this morning lowering visibility. Visuals from near Akshardham. pic.twitter.com/GUkdY7jTCx
— ANI (@ANI) January 8, 2023
నవతెలంగాణ న్యూఢిల్లీ: ఉత్తర భారతం మంచు కోరలలో చిక్కుకుంది. మరోవైపు చల్ల గాలులు వణికిస్తున్నాయి. దట్టంగా అలుముకున్న మంచు తెరలతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. ఢిల్లీలో వరుసగా నాలుగో రోజూ అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సఫ్దర్జంగ్లో 1.9 డిగ్రీలు, రిడ్జ్‌లో 2.2 డిగ్రీలు, ఆయా నగర్లో 2.6, లోధీ రోడ్లో 2.8, పాలమ్‌లో 5.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. భారీగా మంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. గాలి నాణ్యత 359 పాయింట్లకు పడిపోయింది. పంజాబ్‌లోని అమృత్సర్, పటియాల, అంబాలా, చండీగఢ్, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో దృష్య గోచరత మందగించిందని అధికారులు వెల్లడించారు. బీహార్‌లోని గయా, భాగల్పూర్, లక్నో, గ్వాలియర్‌లో 200 మీటర్ల వరకు ముందున్న వాహనాలు కనిపించడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఇక పొగమంచు విమానాలు, రైళ్ల రాకపోకలపై త్రీవ ప్రభావం చూపుతున్నది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే 42 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే శాఖ ప్రకటించింది.