Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సరిహద్దు వద్ద ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. బాలాకోట్‌లోని పూంచ్ సెక్టార్లో శనివారం రాత్రి భద్రతా బలగాలు గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పద కదలికలను గమనించిన సైన్యం.. కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొంత మందికోసం గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. హతమైన ముష్కరులకు ఇటీవల రాజౌరీలో జరిగిన ఉగ్రదాడులతో సంబంధం ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 1న రాజౌరీ జిల్లాలోని దంగ్రీ గ్రామంపై ఉగ్రవాదులు దాడిచేసిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు పౌరులను కాల్చి చంపారు. ఈ ఘటనలో గాయపడిన మరో వ్యక్తి జమ్ములోని దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 7కు చేరింది.