Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 1న తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. స్కూటర్‌పై వెళ్తున్న అంజలి సింగ్ (20)ని ఢీకొట్టిన కారు ఆమెను దాదాపు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. దీంతో శరీరం ఛిద్రమై అంజలి మృతి చెందింది. ప్రమాద సమయంలో స్కూటీపై వెనక కూర్చున్న అంజలి స్నేహితురాలు ప్రాణాలతో బయటపడి అక్కడి నుంచి పారిపోయి ఇంటికి చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించి పలు సీసీటీవీ ఫుటేజీలు వెలుగులోకి వచ్చాయి. అంజలిని కారు ఈడ్చుకెళ్తున్న వీడియో, హోటల్ బయట అంజలి, నిధి గొడవ పడుతున్న వీడియోలు బయటకొచ్చి వైరల్ అయ్యాయి. ఘటన జరిగిన రోజు అంజలి మద్యం తాగినట్టు నిధి చెప్పగా, పోస్టుమార్టం రిపోర్టులో అలాంటి విషయాలేవీ వెల్లడి కాలేదు. తాజాగా, నిధికి సంబంధించి మరో సంచలన విషయం వెలుగు చూసింది. డిసెంబరు 2020లో నిధి తెలంగాణ నుంచి ఢిల్లీకి 30 కేజీల గంజాయి రవాణా చేస్తూ ఆగ్రా రైల్వే స్టేషన్లో పట్టుబడింది. ఈ కేసులో నిధి ప్రస్తుతం బెయిలుపై ఉన్నట్టు పోలీసులు తెలిపారు.