Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
కాసేపట్లో హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ భేటీ కానున్నారు. టీడీపీ ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించే అవకాశముంది. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతానికి ఐక్య కార్యాచరణ రూపొందించే అంశంపై వీరిద్దరూ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని ఇప్పటికే నిర్ణయించిన నేతలు కొద్దినెలల క్రితం విజయవాడలోని ఓ హోటల్లో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్-1పైనా తాజా భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.