Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఢీల్లి
ఈ ఉదయం అక్షర్ధామ్, మధ్య ఢీల్లిలో దట్టమైన పొగమంచు కురిసింది. దీంతో రహదారులపై సమీపంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. పంజాబ్‌లోని అమృత్సర్, పాటియాల, అంబాల, చండీగఢ్‌లో 25 మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో కూడా ఇదే వాతావరణం ఉంది. బిహార్‌లోని గయా, భాగల్పూర్లలో పొగమంచు కారణంగా 200 మీటర్ల దూరంలోని వాహనాలు కనిపించడంలేదు.
పలు చోట్ల 1.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దీంతో చాలా విమానాలు రద్దు కాగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 20 విమానాలు ఆలస్యంగా బయల్దేరతాయాని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు సమాచారం కోసం ఆయా విమానయాన శాఖలను సంప్రదించాలని కోరింది. ఢీల్లిలోని సఫ్దార్‌జంగ్‌లో 1.9 డిగ్రీలు, పాలెంలో 5.2, లోధి రోడ్లో 2.8, రిడ్జ్‌లో 2.2, అయా నగర్లో 2.6 గా ఉష్ణగ్రతలు నమోదయ్యాయి. వాయు నాణ్యత సూచీ 359 పాయింట్లతో వెరీపూర్ కేటగిరీలోకి పడిపోయింది. యూపీలోని లఖ్‌నవూ, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కూడా పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది.