Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతులంగాణ - కామారెడ్డి
జిల్లాలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం ముగిసింది. ముందుగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతు రాములు మృతికి రైతు జే.ఏ.సి సంతాపం ప్రకటించారు. రాములు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై జే.ఏ.సి. అత్యవసర సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా వడ్లూరు, ఎల్లా రెడ్డిలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు సమావేశమయ్యారు. ఈసమావేశానికి 7 ఏడు గ్రామాల రైతులు హాజరయ్యారు. మాస్టర్ ప్లాన్ వివాదంపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రకటనపై పునరాలోచనలో పడ్డరైతులు భవిష్యత్ కార్యచరణ రైతు జే.ఏ.సి. ప్రకటించింది. ఈ క్రమంలో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రేపు ఉదయం నుంచి 49 మంది కౌన్సిలర్లు ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అంతే కాకుండా ఈనెల 11 తర్వాత ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని ప్రకటనను తెలిపారు.