Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తమిళనాడు
తమిళనాడు పుదుకోట్టైలోని తచంకురిచిలో ఆదివారం ఉదయం జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. భారీ భద్రత మధ్య తమిళనాడు మంత్రులు రఘుపతి, మెయ్యనాథన్, జిల్లా కలెక్టర్ కవిత ఈ పోటీలను ప్రారంభించారు. ఈ ఆటలో గెలుపొందిన క్రీడాకారులకు బైక్‌లతో పాటు విలువైన బహుమతులు అందజేయనున్నారు. ఈ తరుణంలో జల్లికట్టు పోటీలు ప్రారంభంలోనే రక్తం చిందింది. మొదటి రోజే 20 మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అయితే, గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు.