Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన తెలిసిందే. చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియా ఎదుట మాట్లాడుతూ ఇవాళ తాను ప్రత్యేకించి చంద్రబాబును కలవడానికి ముఖ్య కారణం మొన్న కుప్పంలో జరిగిన సంఘటన అని తెలిపారు.
వైసీపీ అరాచకాలు, చంద్రబాబును తిరగనివ్వకపోవడం, ఆయనను ప్రజల వద్దకు వెళ్లనివ్వకపోవడం, ఆయన హక్కులను కాలరాయడం, కేసులు పెట్టడం వంటి ఘటలను చూసి, వాటిపై మీడియా ప్రకటనలు కూడా ఇచ్చానని పవన్ వెల్లడించారు. కుప్పంలో జరిగిన సంఘటనకు సంబంధించి నేడు చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు వచ్చానని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అరాచక పాలన, పెన్షన్లు తొలగింపు, ఫీజు రీయింబర్స్ మెంట్, శాంతిభద్రతలు లోపించడం, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వానికి తన బాధ్యతలను గుర్తుచేయడం వంటి అంశాల గురించి తామిరువురం విస్తృతంగా చర్చించుకున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి వాళ్ల సమస్యలపై మాట్లాడనివ్వకుండా ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి చట్టం తీసుకురావడం, ప్రత్యర్థి పార్టీలను అడ్డుకునేందుకు ఇలాంటి చెత్త జీవోలు తీసుకురావడాన్ని ఆపాలని బలంగా నిర్ణయించుకున్నామని తెలిపారు.