Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 12,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ ధీమా వ్యక్తం చేశారు. అందుకు కావాల్సిన నిధులనూ వేగంగా సమీకరించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ‘భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)’ రెండు దశల ఇన్విట్లలో రూ. 2,850 కోట్లు సమీకరించినట్లు తెలిపారు. 2023 మార్చి నాటికి నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
నవంబరు నాటికి 4,766 కి.మీ రహదారులను నిర్మించినట్లు తెలిపారు. 2019- 20లో 10,237 కి.మీ, 2020- 21లో 13,327 కి.మీ, 2021- 22లో 10,457 కి.మీ రోడ్లను నిర్మించినట్లు వెల్లడించారు. 2023లో రోడ్ల నిర్మాణ మంజూరుతో పాటు వాటిని వేగంగా పూర్తిచేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ ఏడాది ఆస్తుల నగదీకరణ ద్వారా సమకూర్చుకోవాల్సిన రూ. 23,000 కోట్లను ఎన్హెచ్ఏఐ వివిధ మార్గాల ద్వారా చేపట్టనుందని ఉపాధ్యాయ తెలిపారు. ‘టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్’ మోడల్, ఇన్విట్ ఇలా వివిధ మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.