Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హాంకాంగ్‌తో ఉన్న సరిహద్దును ఇవాళ చైనా తెరిచింది. దీంతో ప్రజల్లో ఆనంద వాతావరణం కనిపించింది. అయితే, కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్‌ను సమర్పించాలని మాత్రం నిబంధన విధించింది. ఇదే సమయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్బంధం తప్పనిసరి అనే నిబంధనను కూడా చైనా రద్దు చేసింది. రెండేండ్లుగా భార్యను కలుసుకోని హాంకాంగ్ నివాసి చియుంగ్ సెంగ్ బన్ .. ఆదివారం సరిహద్దు తెరవడంతో క్రాసింగ్ పాయింట్‌ను దాటిన తొలి వ్యక్తిగా నిలిచారు. తన భార్యను కలవాలన్న ఆతృతలో ఉన్నానని ఆయన మీడియాతో చెప్పారు. హాంకాంగ్ వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు క్రాసింగ్ పాయింట్‌కు చేరుకున్నారు. చాలా కాలంగా సరిహద్దును మూసి ఉంచడంతో చైనా నుంచి హాంకాంగ్ వెళ్లడం చాలా మందికి దుర్లభంగా మారింది. ఆదివారం ఈ సరిహద్దును తెరుస్తున్నట్లు ప్రభుత్వం రెండు రోజుల క్రితమై ప్రకటించింది. దీంతో హాంకాంగ్ వెళ్లాలనుకునే వారు ఒకేసారి క్రాసింగ్ పాయింట్‌కు వచ్చారు. కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గత కొన్నాళ్లుగా చైనాలో కొవిడ్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతుండటంతో లాక్‌డౌన్‌ను పలు ప్రాంతాల్లో ఎత్తివేశారు. అదే సమయంలో విదేశాల నుంచి వచ్చేవారికి విధించిన నిర్బంధం తప్పనిసరి నిబంధనను చైనా ఎత్తివేసింది. అలాగే, హాంకాంగ్ సరిహద్దును తెరిచింది. దాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు హాంకాంగ్ వెళ్లేందుకు తరలివచ్చారు.