Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: త్రిపుర సీఎం మాణిక్ సాహా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీని పవిత్ర గంగానదితో పోలుస్తూ, అందులో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని ఆయన వ్యాఖ్యానించారు. పాపాలు కడిగేసుకోవాలంటే బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. సౌత్ త్రిపురలోని కాకర్బన్లో ఆదివారంనాడు జరిగిన జన్ విశ్వాస్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది జరుగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని గంగానదితో పోలుస్తూ, స్టాలిన్, లెలిన్ సిద్ధాంతాలపై నమ్మకం ఉన్న వారు బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ''రైలు బోగీల్లో ఇంకా ఖాళీలున్నాయి. ఖాళీ బోగీల్లో కూర్చోండి. ప్రధానమంత్రి నేరంద్ర మోడీ మనం చేరాల్సిన గమ్యానికి చేరుస్తారు'' అని అన్నారు. సీపీఐ(ఎం)పై విమర్శలు చేస్తూ, కమ్యూనిస్టుల హయాంలో ప్రజాస్వామ్యం ఉండదని, ఎందుకంటే వారు హింస, టెర్రర్ టాక్టిక్స్ను నమ్ముతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రజాస్వామిక హక్కులను తుంగలో తొక్కుతూ ఏళ్ల తరబడి వాళ్లు త్రిపురను పాలించారని అన్నారు.