Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు స్వచ్ఛమయిన తాగునీటిని అందించేందుకు మార్కెట్లోకి ఆర్టీసీ బ్రాండ్ జీవా వాటర్ బాటిళ్లు ప్రవేశపెట్టింది. ఈ పథకం జనవరి 9వ తేదీన ప్రారంభిస్తున్నట్టు ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రస్తుతం లీటర్ బాటిళ్ళు అందుబాటులో ఉంటాయని, త్వరలో 250 ఎంఎల్, అర లీటర్ బాటిళ్ల ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. దశల వారీగా తెలంగాణ వ్యాప్తంగా విక్రయాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ జీవా వాటర్ బాటిళ్లు స్పింగ్ ఆఫ్ లైఫ్ అనే ట్యాగ్‌లైన్‌తో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.
స్వచ్ఛమయిన తాగునీటిని ప్రయాణికులకు అందిస్తామని, అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో జీవా వాటర్ బాటిళ్లు విక్రయిస్తామన్నారు. తాగునీటి పేరుతో కల్తీ బ్రాండ్లు మార్కెట్లోకి వస్తున్నాయని, ప్రయాణికుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా జీవా వాటర్ బాటిల్స్ అందిస్తున్నామన్నారుచారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జీవా వాటర్ బాటిళ్ళలోని నీటిని తాగి తమ స్పందన తెలపాలన్నారు.