Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుపతి
తిరుమలలో ఈ నెల 2 నుంచి 11 వరకు వైకుంఠద్వార దర్శనం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గింది. వెంకటేశ్వరస్వామిని నిన్న 62,856 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,115 మంది తలనీలాల మొక్కులు సమర్పించుకున్నారు. నిన్న స్వామివారికి హుండీ కానుకల రూపంలో రూ.2.21 కోట్ల ఆదాయం లభించింది. శ్రీవారి టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.