Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బంగ్లాదేశ్ సరిహద్దులో స్మగ్లింగ్ రాకెట్ పట్టుబడింది. ఈ ముఠా నుంచి పెద్ద మొత్తంలో బంగారం బిస్కెట్లను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) స్వాధీనం చేసుకున్నది. ఈ బంగారం విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఢాకా మీదుగా అగర్తలా నుంచి కోల్‌కతా వెళ్లే బస్సు ద్వారా బంగారాన్ని సరిహద్దు దాటిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్‌లో బస్సు లగేజీ కంపార్ట్మెంట్లో దాచి అక్రమంగా రవాణా చేస్తున్న 30 బంగారం బిస్కెట్లను బీఎస్ఎఫ్ గుర్తించింది. బస్సు డ్రైవర్, కండెక్టర్‌ను అరెస్ట్ చేసి బస్సును బీఎస్ఎఫ్ అధికారులు సీజ్ చేశారు. నిందితులను బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ ఫర్హాద్, అమర్ ఫరూక్‌గా గుర్తించారు. వీరిద్దరూ చాలా కాలంగా బంగారం స్మగ్లింగ్‌లో ఉన్నారని, కోల్‌కతాకు చెందిన మహ్మద్ జమాల్ అనే వ్యక్తికి బంగారు బిస్కెట్లను అందజేయాలని పంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బంగారం స్మగ్లింగ్ చేసినందుకు వీరికి రూ.10వేలు చెల్లించాడు. స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్లతోపాటు నిందితులను కస్టమ్స్‌కు బీఎస్ఎఫ్ అధికారులు అప్పగించారు.