Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మెగాస్టార్ చిరంజీవి హీరో కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టయినర్ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రి రీలీజ్ వేడుకను చిత్రబృందం విశాఖలో ఏర్పాటు చేసింది. తొలుత ఈ కార్యక్రమాన్ని విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించాలని భావించినా పోలీసుల అనుమతి రాలేదు. దాంతో వేదికను ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానానికి మార్చారు. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో ఏయూ మైదానం జనసంద్రంలా మారింది. ఈ ఈవెంట్ కు మెగా ఫ్యాన్స్ పోటెత్తారు.