Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్లో పరుగుల వరద పారించే రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీతో ఎక్కువ రోజులు కొనసాగి రికార్డు సాధించాడు. ఈ ఫ్రాంఛైజీతో రోహిత్ ఈరోజుకు పుష్కర కాలం పూర్తి చేసుకున్నాడు. 2011 జనవరి 8న వేలంలో ముంబై ఇండియన్స్ రోహిత్‌ను రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఈ స్టార్ ఆటగాడు అదే జట్టుతో కొనసాగుతున్నాడు. ‘ముంబై ఇండియన్స్‌తో 12 ఏళ్లు కొనసాగాను అంటే నమ్మలేకపోతున్నా. ఇది చాలా ఆసక్తికరమైన, ఎమోషనల్‌తో కూడిన జర్నీ. ఈ ప్రయాణంలో మనందరం ఎంతో సాధించాం. ముంబై ఇండియన్స్ అనేది నా ఫ్యామిలీ. ఈ సందర్భంగా.. యాజమాన్యం, జట్టు సభ్యులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరిన్ని జ్ఞాపకాలు సొంతం చేసుకునేందుకు, నవ్వులు పంచేందుకు ఎదురుచూస్తున్నా’ అని రోహిత్ అన్నాడు. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ మొదటి స్థానంలో ఉంటాడు. తన సారథ్యంలో ముంబైని తిరుగులేని జట్టుగా తీర్చిదిద్దాడు. అందుకు నిదర్శనంగా.. ఈ ఫ్రాంఛైజీ 5 సార్లు (2013, 2015, 2017, 2019, 2020) ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఆ జట్టుకు ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉన్నది కూడా రోహితే. అంతేకాదు ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసింది కూడా అతనే. 182 మ్యచుల్లో రోహిత్ 4,709 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెప్టెన్‌గా 81 విజయాలతో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. అతని కెప్టెన్సీలో ముంబై 143 మ్యాచులు ఆడిన ముంబై ఇండియన్స్ 81 సార్లు గెలిచింది.