Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఉత్తరప్రదేశ్లోని మనూ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేదార్ సింగ్ మనవడిని దుండగులు కొట్టి చంపారు. కేదార్ సింగ్ మనవడు హిమాన్షు సింగ్ మను జిల్లాలోని మహౌర్ గ్రామంలో ఓ పంచాయితీని పరిష్కరించడానికి వెళ్లాడు. అయితే అక్కడ చిన్న పాటి గొడవ జరిగింది. చిలికిచిలికి అదికాస్తా పెద్దదయింది. దీంతో వైరి వర్గానికి చెందిన ఏడు నుంచి ఎనిమిది మంది హిమాన్షుపై కర్రలతో విచక్షణా రహితంగా దాడిచేశారు. అనంతరం అక్కడి నుంచి తీసుకెళ్లి సమీపంలోని మరో గ్రామంలో వదిలేశారు. గుర్తించిన స్థానికులు అతడిని దవాఖానకు తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. పాత క్షక్షలతోనే ఈ దాడి జరిగిందని మను ఎస్పీ త్రిభువన్ త్రిపాఠి చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దుండగుల కోసం గాలిస్తున్నామన్నారు.