Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం సృష్టించింది. హైదర్గూడ చౌరస్తా వద్ద పాద చారులపైకి లారీ దూసుకెళ్లింది. బస్సు కోసం వేచిచూస్తున్న దంపతులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద భర్త నలిగిపోయాడు. లారీ కింద పడిన భార్యను అక్కడున్న స్థానికులు లాగేయడంతో తీవ్రమైన గాయాలతో బయటపడింది. బాధితురాలను వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. లారీ బీభత్సంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆర్టీసీ బస్సును లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని పోలీసులు తెలిపారు. బాధితులు కర్ణాటక ప్రాంతానికి చెందిన రత్తయ్య, మంజులగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.