Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తు న్న పేకాట స్థావరంపై దాడిచేసి ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు 14 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. కామినేని ఆస్పత్రి సమీపంలోని బాలాజీ గ్రాండ్ హోటల్ రూమ్ నెంబర్ 204లో పేకాట నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు దాడిచేసి నిర్వాహకుడు మల్కాను ల్ల మురళీ మోహన్‌తోపాటు పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్టు చేశా రు. వారి వద్ద నుంచి రూ. 1,11,170, 16 మొబైల్ ఫోన్లు, 8 బైకులు, 4 సెట్ల పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు.