Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
పుదుకోట జిల్లా తచ్చంకుర్చి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తమిళ సంప్రదాయ, సాహసక్రీడ జల్లికట్టు తొలి పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మైదానంలో రంకెలేస్తూ పరుగులు తీసిన ఎద్దులను అదుపుచేసేందుకు యత్నించిన 70 మంది యువకులకు గాయాలయ్యాయి. వేదిక ప్రాంగణంలో రద్దీ నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జీ జరిపారు. తచ్చంకుర్చి గ్రామంలోని సెయింట్ అడకల్నాధర్ చర్చి ప్రాంగణంలో సమైక్యత పొంగల్ వేడుకల పేరుతో నిర్వహించిన ఈ పోటీల్లో శిక్షణ పొందిన సుమారు 500 పైచిలుకు ఎద్దులతో యజమానులు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి ముందే టోకెన్లు పొందిన 235 మంది క్రీడాకారులకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా, సుప్రీంకోర్టు విధివిధానాలు అనుసరించి నిర్వాహకులు పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు సిద్ధం చేశారు.