Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నై
తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చేస్తున్న సమయంలో డీఎంకే సభ్యులు ఇవాళ సభలో నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ తరుణంలో సీఎం స్టాలిన్ జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డులోకి తీసుకోవాలని, గవర్నర్ తన ప్రసంగంలో కొత్తగా జోడించిన అంశాలను తీసివేయాలని సీఎం స్టాలిన్ స్పీకర్ను ఆదేశించి, అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీంతో మళ్లీ స్టాలిన్, గవర్నర్ మధ్య వైరం కొత్త స్థాయికి చేరినట్లు అయ్యింది. డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించాయి. ఈ క్రమంలో తమిళనాడు అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ రవి వాకౌట్ చేశారు.
బిల్లు క్లియర్ చేయడంలో గవర్నర్ ఆలస్యం చేస్తున్నట్లు ఆ పార్టీలు ఆరోపించాయి. అసెంబ్లీలో ఆమోదం పొందిన 21 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నట్లు డీఎంకే మిత్రపక్షాలు ఆరోపించాయి. గవర్నర్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో నినాదాలు హోరెత్తాయి. క్విట్ తమిళనాడు అని స్లోగన్స్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని తమపై రుద్ద వద్దు అని డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.