Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
యాపిల్ సంస్థ భారత్ లో తన సొంత రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేస్తోంది. ఈ తరుణంలో ముందుగా ముంబై, ఢిల్లీలో యాపిల్ స్టోర్లు తెరుచుకోనున్నాయి. ఈ స్టోర్లలో పనిచేసేందుకు వీలుగా సంస్థ ఉద్యోగులను నియమించుకోవడంపై దృష్టి సారించింది. యాపిల్ ఇండియా తన అధికారిక పోర్టల్ లో జాబ్ ఓపెనింగ్స్ వివరాలను ప్రచురించింది.
భారత్ లోని వివిధ ప్రాంతాల్లో పనిచేసేందుకు వీలుగా ఆసక్తి, అర్హత కలిగిన వారి నుంచి టెక్నికల్ స్పెషలిస్ట్ లు, స్టోర్ లీడర్లు, స్పెషలిస్ట్ లు, మేనేజర్లు, బిజినెస్ ఎక్స్ పర్ట్ లు, క్రియేటివ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని యాపిల్ కోరింది. జీనియస్ పోస్ట్ ను కూడా ప్రకటించింది. కస్టమర్ల సాంకేతిక సమస్యలకు సమాధానం చెప్పడం వీరి పని. యాపిల్ ఉత్పత్తులకు సంబంధించి కస్టమర్ల ఎక్స్ పీరియన్స్ ను పెంచే విధంగా వీరు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వారంలో 40 గంటలు పని చేయాలని సంస్థ తెలిపింది. స్థానిక భాషల్లో ప్రావీణ్యంతో పాటు, ఇంగ్లిష్ ప్రావీణ్యం కూడా అవసరం.