Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యా సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీచి ట్రస్టు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ''విభిన్న మతస్థుల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు తొలిగిపోవాలన్నా, ఒకరిపై ఒకరికి ఉన్న తప్పుడు భావాలను అధిగమించాలన్నా, రెండు మతస్థుల మధ్య విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉందని`` అన్నారు. అజ్ఞానం, అవిద్య వల్ల భిన్న మతస్థుల్లో విబేధాలు వస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండు మతస్థుల మధ్య ఉన్న తేడాలపై చాలా భయానకమైన తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయని, అన్ని రకాలుగా ఆ తేడాలు ఉన్నాయని, ఇవన్నీ అజ్ఞానం, చదువులేకపోవడం వల్ల కలిగే భావనలు అని ఆయన అన్నారు.
ఒక ముస్లిం వ్యక్తి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే, అసలు ఆ వ్యక్తి ఎందుకు ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడో అడిగి తెలుసుకోవాలని అమర్త్యాసేన్ అన్నారు. ఒక అంశం విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయబేధాలు ఉంటాయని చెప్పారు. దీని కోసం ఆయన తన అయిదేళ్ల కూతురికి ఎదురైన ఓ ఘటనను గుర్తు చేశారు. స్కూల్ అడ్మిషన్‌కు వెళ్లిన సయమంలో తన కూతురు ఆంటారాకు టీచర్ రెండు రంగలు పెన్సిల్స్ చూపించిందని, రెడ్, బ్లూ కలర్ పెన్సిల్ ఏంటో చెప్పాలని ఆ టీచర్ అడిగిందని, కానీ తన కూతురు దానికి సమాధానం ఇవ్వలేకపోయిందన్నారు. నాన్నా ఆ వ్యక్తికి రేచీకి ఉందా.. కలర్స్ గుర్తించలేడా అని ప్రశ్నించడం తన బాధించిందని అమర్త్యాసేన్ అన్నారు. ఈ నేపథ్యంలోనే యుక్త సాధన చేయాలని, హిందువులు.. ముస్లిం కలిసి పనిచేయాలన్నారు. ఇద్దరు ఒక్కటి అయ్యేందుకు దారులు వెతుకాలని, చిన్న చిన్న అంశాలతోనే కలిసిపోవాలని, హిందూ-ముస్లిం సంస్కృతి ఏకీకరణకు పనిచేయాలని అమర్త్యాసేన్ తెలిపారు.