Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢీల్లి
జాతీయ విమానయాన సంస్థ బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఘర్షణ పడ్డారు. ఆ సంస్థకు చెందిన బోయింగ్ 777 విమానం గాల్లో ఎగురుతుండగా ఇద్దరు ప్రయాణికులు ఘర్షణకు దిగారు. చొక్కా తీసేసి ఉన్న యువకుడు, పక్క సీటు వ్యక్తి మధ్య గొడవ జరిగింది. దీంతో పైకి లేచిన ఆ యువకుడు సీటులో కూర్చొని ఉన్న వ్యక్తిపై పంచ్‌లు ఇచ్చాడు. మరోవైపు సీటులో కూర్చొన్న వ్యక్తి కూడా యువకుడి చెంపపై కొట్టాడు. ఇంతలో తోటి విమాన ప్రయాణికులు, విమాన సిబ్బంది జోక్యం చేసుకున్నారు. వారిద్దనీ విడదీశారు. విమానంలోని కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.