Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రన్నింగ్ క్వాలిఫై అయిన ఎస్.ఐడ కానిస్టేబుల్ అభ్యర్థులను మెయిన్స్ కు అనుమతించాలని ఆందోళన చేస్తున్న ఎస్.ఎఫ్.ఐ./ డివైఎఫ్ఐ నాయకుల అక్రమ అరెస్టులు దుర్మార్గం, అర్ధరాత్రి ఇండ్లలో వెళ్ళి అరెస్టులు చేయడం సిగ్గుచేటు: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఖండన
నవతెలంగాణ-హైదరాబాద్
రన్నింగ్ లో క్వాలిఫై అయ్యిన పోలీసు అభ్యర్ధులందరికి మెయిన్స్ అర్హత కల్పించాలని కోరుతూ గత రెండు నెలలు నుండి ఆందోళన చేస్తున్న ఎస్.ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులపై కనీసం ప్రభుత్వం స్పందించడం లేదు. స్పందించాలని కోరుతూ ఈరోజు విద్యార్ధి, యువజన సంఘాలు ఛలో ప్రగతిభవన్ కార్యక్రమానికి పిలుపు నివ్వడం జరిగింది. ఈ సందర్భంగా అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్, డివైఎఫ్ఐ నాయకత్వాని అక్రమంగా హైదరాబాద్ రాకుండా ముందస్తు అరెస్టులు చేయడం హేయమైన చర్య. ఒక్క ప్రక్క యేళ్ళుగా నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.
పాత పద్దతులలో ఈవెంట్స్ నిర్వహించకపోవడం, రన్నింగ్ క్వాలిఫై అయినా ప్రధాన పరీక్షకు అనుమతించక పోవడం లాంటి చర్యలు వల్లన చాలా మంది నిరుద్యోగులు తమ జీవితాలను నష్టపోతున్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లాలో పుప్పాల రవికుమార్ అనే అభ్యర్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. తక్షణమే రాష్ట్ర హొంమంత్రి, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, డిజిపి తక్షణమే అభ్యర్థులతో చర్చలు జరిపి వారికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన విద్యార్ధి నాయకులను, ప్రగతి భవన్ ముట్టడిలో అరెస్ట్ అయిన వారిని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. భవిష్యత్ పోరాటాలకు ఎస్ఎఫ్ఐ మద్దతుగా నిలబడుతుందని రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు లు తెలిపారు.