Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : నందమూరి బాలకృష్ణ హీరోగా రాయలసీమ నేపథ్యంలో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. తనకు కలిసొచ్చిన కథావస్తువుతో బాలకృష్ణ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన వీరసింహారెడ్డి ఈ నెల 12న విడుదలవుతోంది. తాజాగా, ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది. వీరసింహారెడ్డికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ కేటాయించింది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషించింది. తమన్ సంగీతం అందించాడు. ఇటీవల ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో వేడుకగా జరిగింది. అటు, వీరసింహారెడ్డి ట్రైలర్ ఆన్ లైన్ లో దూసుకుపోతోంది. బాలకృష్ణ చెప్పిన డైలాగులు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి... సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.