Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ప్రధానమంత్రి నరేంద్ర మోఢీ ఈ నెల 19న తెలంగాణలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి ప్రారంభించనున్నారు. ఈ తరుణంలో రూ.7వేల కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 19వ తేదీ ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉదయం 10 గంటలకు ప్రతిష్టాత్మక వందేభారత్ ట్రైన్ ను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. రూ.699 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి భూమిపూజ చేస్తారు.
రూ. 1,850 కోట్ల వ్యయంతో 150 కి. మీ. ల పొడవున నిర్మించనున్న 3 జాతీయ రహదారి ప్రాజెక్టుల విస్తరణ పనులకు భూమిపూజ చేస్తారు. రూ. 521 కోట్ల వ్యయంతో కాజీపేట్ నందు నిర్మించనున్న రైల్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపునకు భూమిపూజ చేస్తారు. అలాగే రూ. 1,410 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్-మహబూబ్నగర్ మధ్య 85 కి.మీ. ల పొడవున నిర్మించిన డబుల్ లైన్ జాతికి అంకితం చేస్తారు. దీంతో పాటు ఐఐటీ హైదరాబాద్లో రూ. 2,597 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు నిర్మాణాలను జాతికి అంకితం చేస్తారు. అదే రోజున పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.