Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇండోర్‌లోని ఇద్దరు చిన్నారులు కాలిన గాయాలతో మరణించారు. ఇంట్లో స్నానం చేసేందుకు ఉంచిన వేడినీళ్లే ఈ ఇద్దరి ప్రాణాలు తీశాయి. ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. తల్లులు చేసిన చిన్న పొరపాట్లు ఆ బాలికల ప్రాణాలు తీశాయి. ఏడాదిన్నర బాలిక సోనిక తండ్రి రాజు మాట్లాడుతూ.. జనవరి 7న తన భార్య స్నానం చేయడానికని నీటిని వేడి చేసిందని, ఆ తర్వాత ఆ వేడి నీటిని బాత్రూం దగ్గర ఉంచిందని చెప్పాడు. ఆ సమయంలో సోనిక ఆడుకుంటూ అక్కడికి వెళ్లి వేడినీళ్ల బకెట్‌ను లాగింది. దాంతో ఆ వేడి నీళ్లు బాలిక శరీరంపై పడి బొబ్బలు లేచాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి ఆ బాలిక మృతి చెందింది. ఇక, భాగియా ప్రాంతంలో నివసిస్తున్న రాజేష్ చౌక్సే మూడేళ్ల కుమార్తె లావ్య కూడా జనవరి 5 తెల్లవారుజామున కాలిపోయింది. లావ్యకు స్నానం చేయించడానికి ఆమె తల్లి వేడి నీటిని మరిగించి బాత్రూంలో పెట్టింది. పాలు వేడి చేయడానికి వంటింట్లోకి వెళ్లింది. ఈ లోగా లావ్య అక్కడకు వెళ్లి తన రెండు చేతులను బకెట్లో పెట్టింది. ఆ నీరు శరీరంపై పడడంతో లావ్య శరీరం మొత్తం కాలిపోయింది. ఆ చిన్నారి కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది.