Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : తొలి వన్డేలో భారత్ శ్రీలంకపై భారీ విజయం సాధించింది. 67 పరుగులతో లంకను చిత్తు చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కింగ్ కోహ్లీ కళాత్మక షాట్లతో 45వ వన్డే సెంచరీకి తోడు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అర్థసెంచరీ చేయడంతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. శ్రీలంకకు 374 పరుగుల టార్గెట్ నిర్ధేశించింది. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో కెప్టెన్ దసున్ షనక తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ (108) బాదాడు. నిర్ణీత ఓవరల్లో లంక 8 వికెట్ల నష్టానికి 306 రన్స్ చేసింది. షనక ఇచ్చిన రెండు క్యాచ్‌లు రోహిత్ శర్మ, కోహ్లీ క్యాచ్‌లు జారవిడిచారు. దాంతో లంక పరుగులు 300 పరుగులు చేయగలిగింది. లంక టాపార్డర్‌లో ఓపెనర్ ప్రథుమ్ నిస్సంకా (72), ధనంజయ డిసిల్వా(47), చరిత అసలంక (23) రాణించారు. భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ లంకను ఒత్తిడిలోకి నెట్టారు. ఆవిష్క ఫెర్నాండో(5), కుశాల్ మెండిస్(0)లను అవుట్ చేసి సిరాజ్ లంకను దెబ్బతీశాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. చాహల్, షమి, హార్ధిక్ పాండ్యాకు ఒక్కో వికెట్ దక్కింది.