The audience got up and danced the “Naatu Naatu” during #RRRMoive pic.twitter.com/vPFUMlFJ9f
— Courtney Howard (@Lulamaybelle) January 10, 2023
Authorization
The audience got up and danced the “Naatu Naatu” during #RRRMoive pic.twitter.com/vPFUMlFJ9f
— Courtney Howard (@Lulamaybelle) January 10, 2023
నవతెలంగాణ : ఆర్ఆర్ఆర్ మూవీలోని 'నాటు నాటు' పాట సినిమా విడుదలకు ముందే అందరిని ఒక ఊపు ఊపేసింది. భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల వారిని ఉర్రూతలూగించింది. 2021లో ఈ పాట ఇప్పటికే ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. మాస్ బీట్తో ప్రతి ఒక్కరిని నాటు స్టెప్పులు లేసేలా చేసింది. ఇక సాంగ్లో రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. విదేశీయుల చేత కూడా కాళ్లు కదిపేలా చేశారు ఈ స్టార్ హీరోలు. ఈ పాట విడులైన కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్లో తెగ షేరింగ్ అయింది. అంతలా ఆదరణ పొందిన ఈ పాట ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకున్నది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును గెలుపొందించింది. దీంతో ఒరిజినల్ సాంగ్ విభాగంగాలో ఆసియా నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న మొదటి పాటగా రికార్డుల్లో నిలిచింది.