Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చలిలో వణికిపోతున్న ముక్కుపచ్చలారని పిల్లలను పట్టించుకోకుండా మద్యం మత్తులో ఓ తల్లి తూలిపోతూ కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ పిల్లలను శిశుసంక్షేమ శాఖ సిబ్బందికి అప్పగించి ఆశ్రయం కల్పించారు. గోపాలపురం ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ కథనం ప్రకారం.. సికింద్రాబాద్ స్టేషన్ ప్రాంతంలో ఓ మహిళ(26) నాలుగేళ్ల కుమారుడు, 30 రోజులు పాపతో ఉంటూ భిక్షాటన చేస్తోంది. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంటకు గోపాలపురం ఎస్సై అనిల్‌కుమార్, పెట్రోలింగ్ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్నారు. స్టేషన్ అవుట్గేట్ ప్రాంతంలో ఓ మహిళ మద్యం మత్తులో ఉండి పిల్లలను దగ్గరకు తీసుకోకుండా దూరంగా నెట్టి పడేస్తుంది. ఆ ఇద్దరు చిన్నారులు తీవ్రంగా రోదిస్తుండటం పోలీసులు గుర్తించారు. పోలీసులు 108ను పిలిపించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. చలిలో వణికిపోతున్న బాబు, పాపను ఠాణాకు తీసుకెళ్లిన పోలీసు సిబ్బంది ఉదయం వరకు వారి ఆలనాపాలనా చూసుకున్నారు. మంగళవారం ఉదయం ఛైల్డ్‌లైన్ సిబ్బందిని పిలిచి వారికి అప్పగించారు.