Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : ప్రైయివేటు బస్సుల పై ఆర్టిఎ అధికారులు వేటు వేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల భద్రతా దృష్ట్యా తనిఖీలు నిర్వహించారు. వనస్థలిపురం దగ్గర ఆర్టిఎ సోదాలు నిర్వహించారు. విజయవాడ వైపు వెళ్తున్న బస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా సరైన ప్రమాణాలు పాటించని పది ప్రైయివేటు బస్సులపై కేసులు నమోదుచేశారు. రెండు బస్సులను సీజ్ చేశారు. ప్రైయివేటు బస్సులు తప్పనిసరిగా ప్రమాణాలను పాటించాలని, లేనిపక్షంలో కేసులు నమోదుచేస్తామని ఆర్టిఎ అధికారులు హెచ్చరించారు.