Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్ కు చెందిన శాంతికుమారి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సోమేశ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిన్న సమర్థించిన విషయం తెలిసిందే. ఆ వెనువెంటనే సోమేశ్‌కుమార్ తెలంగాణ నుంచి రిలీవ్ కావాలంటూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త సీఎస్ నియామకం అనివార్యం అయింది. దీంతో నిన్ననే కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు శాంతికుమారి పేరును ఖరారు చేసింది. ఆమె 2025 వరకు పదవీలో కొనసాగనున్నారు.
శాంతికుమారి వైద్య, ఆరోగ్యశాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్‌గా పనిచేశారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. ఆమె ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆమెకు అభినందనలు తెలియజేశారు.
ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీతో పాటు, అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసిన శాంతికుమారి గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్‌గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్‌లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు.