Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్
నవతెలంగాణ కంటేశ్వర్
భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో జరుగనున్న పదవతరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణమార్పులు చేయాలని ఏడి నాగజ్యోతి కి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ నిజామాబాద్ నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పదవ పరీక్షలలో మొదటిసారిగా పబ్లిక్ పరిక్షలు రాస్తున్న విద్యార్థులను మానసిక ఒత్తిడిని దూరం చేసే విధంగా టెన్త్ క్వశ్చన్ పేపర్లలో 30% చాయిస్ ప్రశ్నలుపెంచాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న పదవ తరగతి పరీక్షలులో పేపర్లను కుదించి 6 పేపర్లు చేయడం ఆహ్వానించదగ్గ విషయం కానీ ఆబెక్టీవ్ ప్రశ్నలు 2 మార్కుల 3 మార్కుల ప్రశ్నలకు ఏలాంటి ఛాయిస్ ఇవ్వలేదు.
వ్యాసరూప ప్రశ్నలలో కూడా సెక్షన్లను పెట్టకుండా ఇచ్చిన సమయంలో అన్ని రాయాలని పెట్టడం వలన సిలబస్ మొత్తం ఒకే పేపర్ లో విద్యార్ధులు రాయాలంటే సమయం సరిపోక విద్యార్ధుల అయోమయంలో పడి పరీక్ష అంటే కఠినంగా ఉంటుందని ఒత్తిడికి లోనైతే పరీక్షలు ఏ విధంగా రాస్తారో ప్రభుత్వానికే తెలియాలని అన్నారు.అదే విధంగా పరీక్షలు రాస్తున్న విద్యార్ధులంతా కరోనా సమయంలో ఆన్ లైన్ లో సరిగ్గా డిజిటల్ విద్య అందుబాటులో లేని సమయంలో చదువుకోవడం మూలంగా సరైన అభ్యాసన లేని వారు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న కనీసం ఈ పరిస్థితి దృష్ట్యా కనీసం ఛాయిస్ లేకుండా చేస్తే విద్యార్ధులు నష్ట పోతారు. ఉన్నత విద్యలో ఛాయిస్ ఉంది,ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి పరీక్షలు ఉంది.కానీ పాఠశాల విద్యలో లేకపోవడం విడ్డురమని, దీనికి తోడు ఈ పరీక్ష షెడ్యూల్ ప్రతిరోజూ పరీక్ష ఉందని ఇది కూడా ఒత్తిడి పెంచుతుంది. ప్రతిరోజూ కాకుండా రోజు విడిచి రోజు పరీక్ష నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది అన్నారు. అలాగే ప్రభుత్వం కౌన్సెలింగ్ చేస్తామని, కౌన్సీలర్స్ ను కేటాయిస్తామని చెప్పినా కూడా విద్యార్ధులకు నష్టం జరిగే అవకాశం ఉంది. గత సంవత్సరం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అనుభవం ఉంది.కావున తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరీక్షల్లో ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు శివ, శ్రీ హరి, రాజ్ కుమార్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.