Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ పంజాబ్: లుథియానాలో ప్రాంతీయ రవాణా అధికారిగా పనిచేస్తోన్న నరీందర్ సింగ్ ధాలీవాల్ ట్రాన్స్పోర్టర్ల నుంచి లంచం తీసుకొని అక్రమ వాహనాలకు చలాన్లు వేయకుండా విడిచి పెడుతున్నారన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ అరెస్టును పీసీఎస్ అధికారుల సంఘం తప్పుబడుతూ సోమవారం నుంచి ఐదు రోజుల పాటు మూకుమ్మడి సెలవులకు పిలుపునిచ్చింది. దీంతో ఉద్యోగుల తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం మధ్యాహ్నం 2గంటల లోగా విధుల్లో హాజరుకాకపోతే సస్పెండ్ చేస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఈ క్రమంలో సీఎం అదనపు ముఖ్య కార్యదర్శి ఎ. వేణుప్రసాద్ అధికారులతో సమావేశం కావడంతో వారు దిగొచ్చారు. తమ సహచర ఉద్యోగిని అరెస్టుకు నిరసనగా పంజాబ్ సివిల్ సర్వీస్ అధికారులు సామూహిక సెలవులకు పిలుపునివ్వడంపై ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం వేణు ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. వారంతా తక్షణమే విధుల్లో చేరతారని తెలిపారు. పీసీఎస్ అధికారుల సంఘం ప్రతినిధులతో సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందన్నారు. అనంతరం ఆ సంఘం అధ్యక్షుడు రజత్ ఒబేరాయ్ మాట్లాడుతూ.. సామూహిక సెలవు పిలుపును ఉపసంహరించుకోనున్నట్టు స్పష్టంచేశారు.