Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సికింద్రాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య పరుగులు పెట్టడానికి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ 'వందే భారత్' ఎక్స్ ప్రెస్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలో సికింద్రాబాద్ లో ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా ఈరోజు వైజాగ్ కు వందేభారత్ రైలు వచ్చింది. అయితే ఈ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది రాళ్ల దాడేనని వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ఈ ఘటనపై డీఆర్ఎం అనూప్ సత్పతి విచారణకు ఆదేశించారు.