Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఎక్కువ మందికి కొవిడ్ ఒమైక్రాన్ బీఎఫ్7 వేరియంట్ సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా అంతర్జాతీయ విమాన ప్రయాణికులను పరీక్షించగా, వారిలో 200 మందికి కొవిడ్ పాజిటివ్ అని తేలిందని మంత్రి మాండవీయ పేర్కొన్నారు. చైనా దేశంలో ఒమైక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 కేసులు పెరుగుతున్నాయని, దీంతో తాము అంతర్జాతీయ ప్రయాణికుల నమూనాలను జీనోమ్ సీక్వేన్స్ కు పంపిస్తున్నామని మంత్రి తెలిపారు. ఒమైక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 కు వ్యతిరేకంగా తాము వేసిన కొవిడ్ టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని మంత్రి చెప్పారు. దేశంలో ఇన్ఫెక్షన్ల సంఖ్య 4,46,80,386కి చేరుకుంది.కొవిడ్ మరణాల సంఖ్య 5,30,722కి చేరిందని గురువారం ఉదయం అప్డేట్ చేసిన డేటా పేర్కొంది.దేశంలో ఇప్పటివరకు కొవిడ్ -19 వ్యాక్సిన్ 220.15 కోట్ల డోస్‌లు ఇచ్చామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.