Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ములుగు జిల్లాలోని మంగపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. గురువారం తెల్లవారుజామున మంగపేట మండలంలోని రాజుపేట వద్ద ఆర్టీసీ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మరణించారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు. బస్సు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి హనుమకొండకు వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.