Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : విద్యాసంస్థలకు సంక్రాతి సెలవులు ప్రారంభమయ్యాయి. పిల్లాపాపలతో నగరవాసులు ఊర్లకు బయలుదేశారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికమైంది. ఈనేపథ్యంలో చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. అయితే టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా అధికారులు ముందుగానే చర్యలు తీసుకున్నారు. టోల్ బూత్‌లలో రెండు సెకన్లకే వాహనాలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడంతో వాహనాలు తొందరగా వెళ్తున్నాయి.
కాగా, జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జోన్, బ్లాక్ స్పాట్ల వద్ద అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు హైవేపై గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. పంతంగితోపాటు కొర్లపాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద పటిష్ట చర్యలు చేపట్టారు.