Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేకు రం గం సిద్ధమవుతోంది. న్యూజిలాండ్తో ఈనెల 18వ తేదీన ఆరంభమవనున్న మూడు వన్డేల సిరీ్సలోని తొలి మ్యాచ్కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుండడం తెలిసిందే. ఈ మ్యాచ్ టిక్కెట్లను శుక్రవారం నుంచి ఆన్లైన్లో విక్రయించనున్నారు. గత సెప్టెంబరులో భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టిక్కెట్ల విక్రయం సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజరుద్దీన్ బుధవారం ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపాడు. ప్రారంభ టిక్కెట్ ధర రూ.850 కాగా, గరిష్ఠ టిక్కెట్ ధరను రూ.20,650గా నిర్ణయించారు. మీడియా సమావేశంలో హెచ్సీఏ కార్యదర్శి విజయానంద్, సూపర్వైజింగ్ కమిటీ సభ్యుడు వంకా ప్రతా్ప పాల్గొన్నారు.
పేటీఎంలో మాత్రమే విక్రయం: గత సెప్టెంబరులో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కౌంటర్లలో టిక్కెట్లు విక్రయించడం లేదని.. కాంప్లిమెంటరీ పాసులు మినహా మిగిలిన టిక్కెట్లన్నీ ఆన్లైన్లో పేటీఎం ద్వారా అమ్మనున్నామని అజర్ చెప్పుకొచ్చాడు. స్టేడియం మొత్తం సీటింగ్ సామర్థ్యం 39 వేల 112 కాగా, అందులో 9,695 టిక్కెట్లు కాంప్లిమెంటరీ కోటాకు కేటాయించారు. మిగిలిన 29 వేల 417 టిక్కెట్లను అమ్మకానికి పెట్టనున్నారు. ఒక వ్యక్తి గరిష్ఠంగా నాలుగు టిక్కెట్లు మాత్రమే కొనుగోలు చేసే లా సాఫ్ట్వేర్ను రూపొందించారు.
13 నుంచి టిక్కెట్ల అమ్మకాలు: శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం నాలుగు లాట్లలో టిక్కెట్లను విక్రయించనున్నారు. 13వ తేదీన సా. 5 గం.కు ఆరు వేలు టిక్కెట్లు, 14వ తేదీ సా. 5 గం.కు ఏడు వేలు టిక్కెట్లు, 15వ తేదీ సా. 5 గం.కు ఏడు వేలు టిక్కెట్లు, మిగిలిన వాటిని 16వ తేదీ సా. 5 గం.కు అమ్మనున్నారు. ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు ప్రభుత్వ గుర్తింపు గల ఏదైనా ఐడీ ఫ్రూఫ్ను తీసుకొని ఎల్బీ, గచ్చిబౌలి స్టేడియాల్లో బార్కోడ్ ముద్రించిన టిక్కెట్లను తీసుకోవాలి. ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు ఈ రెండు కేంద్రాల్లో 15వ తేదీ ఉదయం 10 గం.నుంచి బార్కోడ్ టిక్కెట్లను పొందవచ్చు.