Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
శబరిమలలో అరవణ ప్రసాదం విక్రయాలు నిలిపివేయాలంటూ ట్రావెన్ కూర్ దేవస్వోమ్ బోర్డును కేరళ హైకోర్టు ఆదేశించింది. దీనిలో ఉపయోగించే యాలకుల్లో పరిమితికి మించి రసాయన పదార్థాలు (పురుగుమందుల అవశేషాలు) ఉంటున్నాయన్న నివేదికను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో విక్రయాల నిలిపివేతకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తరుణంలో రసాయన పదార్థాలతో కూడిన యాలకులు లేకుండా తయారుచేసిన ప్రసాదం విక్రయించుకోవచ్చని హైకోర్టు వెసులుబాటు కల్పించింది. లేదా, ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేసిన యాలకులతో తయారుచేసిన ప్రసాదాన్ని విక్రయించుకోవచ్చని ట్రావెన్ కూర్ దేవస్వోం బోర్డుకు స్పష్టం చేసింది.