Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలతో ఈరోజు కూడా నష్టాల్లో ముగిశాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఈరోజు వెలువడుతున్న క్రమంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతుండటం మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్లు నష్టపోయి 59,958కి పడిపోయింది. నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 17,858కి దిగజారింది.