Authorization
Sat May 17, 2025 12:31:10 am
నవతెలంగాణ : కర్ణాటక రాజధాని బెంగళూరులో రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి అందులోపడి గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ రోడ్డు మార్గాన్ని మూసివేశారు. సెంట్రల్ బెంగళూరులోని షోలే సర్కిల్‌లో ఈ సంఘటన జరిగింది. మెట్రో రెండో దశ నిర్మాణం జరుగుతున్న రూజ్ బ్రిగేడ్ రోడ్‌పై గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఒక వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. అయితే ఉన్నట్టుండి రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో అదుపుతప్పిన వ్యక్తి అందులో పడటంతో గాయపడ్డాడు. ఆ వ్యక్తిని పునీత్‌గా గుర్తించారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే ఆ మార్గాన్ని అధికారులు మూసివేశారు. సిబ్బందిని వెంటనే అక్కడకు రప్పించి రోడ్డుపై ఏర్పడిన గంతను పూడ్చే పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఒక వైపు మార్గంలోని రోడ్డును బారికేడ్లతో మూసివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరోవైపు మంగళవారం లోహిత్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి బైక్‌పై వెళ్తుండగా నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ వారిపై కూలింది. ఈ ప్రమాదంలో భార్య, కుమారుడు మరణించారు. లోహిత్, అతడి కుమార్తె గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన కూతవేటు దూరంలోనే గురువారం రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అందులో పడ్డాడు. అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డాడు.