Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంకతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక టీమిండియా బౌలర్ల ధాటికి 39.4 ఓవర్లలో 215 ఆలౌట్ అయింది. శ్రీలంక లోయర్ ఆర్డర్ పోరాడబట్టి శ్రీలంకతో స్కోరు చేయగలిగింది.
శ్రీలంక జట్టులో కొత్త ఓపెనర్ నువనిదు ఫెర్నాండో 50 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కుశాల్ మెండిస్ 34, దునిత్ వెల్లాలగే 32, కరుణరత్నే 17, కసున్ రజిత 17 పరుగులు చేశారు. ఈ తరుణంలో భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, కుల్దీప్ యాదవ్ 3, ఉమ్రాన్ మాలిక్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.