Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నపతెలంగాణ - హైదరాబాద్
ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక సూచన చేశారు. ఆటోఎక్స్పో కార్యక్రమంలో ఆయన మాటట్లాడుతూ 2024 నాటికి రోడ్డు ప్రమాదాలను 50 శాతం మేర తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం ఏదైనా నిబంధనను తప్పనిసరి చేయకముందే కంపెనీలే సుమోటోగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచంలో భారత ఆటోమొబైల్ రంగాన్ని అగ్రస్థానంలో నిలపడమే తమ లక్ష్యమని, అదే సమయంలో రోడ్డు ప్రమాదాలనూ తగ్గించాల్సిన బాధ్యతా తమపై ఉందన్నారు. ముఖ్యంగా 18-34 మధ్య వయసు వ్యక్తులు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కాబట్టి వాహనాల్లో భద్రతా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు వాహన తయారీ కంపెనీలు కృషి చేయాలన్నారు. ఇది కొంచెం కష్టమే అయినా నూరు శాతం అసాధ్యమైతే కాదని పేర్కొన్నారు.