Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ శాంతికుమారికి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. శాంతికుమారి చిత్తశుద్ధి.. రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని ట్వీట్ ద్వారా ప్రశంసించారు. తెలంగాణ తొలి మహిళా సీఎస్‌గా శాంతికుమారి నియామకం హర్షణీయమన్నారు. తెలంగాణ మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు వెళ్లాల్సిందేనని న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాంతికుమారిని సీఎస్‌గా ప్రభుత్వం నియమించింది. 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖను పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి వి.శేషాద్రి బుధవారం నియామక ఉత్తర్వులు (జీవో నంబర్ 71) జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఓ మహిళా ఐఏఎస్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. శాంతికుమారి సర్వీసు 2025 ఏప్రిల్ వరకు ఉంది. ఆమె పదవీ విరమణకు ఇంకా రెండేళ్ల మూడు నెలల కాలం మిగిలి ఉండడంతో.. ఎక్కువ కాలం పని చేసే అవకాశం ఉండడం, తెలుగు అధికారిణి కావడం, పోటీలో ఉన్న అధికారుల్లో సీనియర్ కావడంతో ఆమెను సీఎస్‌గా నియమించారు. రామకృష్ణారావు 2025 ఆగస్టులో, అర్వింద్‌కుమార్ 2026 ఫిబ్రవరిలో రిటైర్ కానున్నా.. వీరిద్దరి కంటే శాంతికుమారి సీనియర్ కావడంతో ఆమె వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.