Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహితి ఉపాధ్యక్షులు తంగిరాల
నవతెలంగాణ హైదరాబాద్: అలిశెట్టి ప్రభాకర్ తెలుగు కవిత్వంలో పరిచయం అక్కరలేని కవి అని తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి అన్నారు. తెలంగాణ సాహితి హైదరాబాద్ నగర కమిటీ ఆధ్యర్యంలో నగర ఉపాధ్యక్షులు అనుమూల ప్రభాకరాచారి అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన తంగిరాల మాట్లాడుతూ.. యువతరానికి అలిశెట్టి కవిత్వం ఒక దిక్సూచి అని తెలిపారు. కలంతో కవాతు చేసి.. రాశి కన్నా వాసి గొప్పదని నిరూపించిన సాహితీ సూరీడు అలిశెట్టి ప్రభాకర్ అని అన్నారు. తెలంగాణ సాహితి రాష్ట్ర సహాయకార్యదర్శి సలీమ మాట్లాడుతూ అక్షరాన్ని ఆయుధం చేసి తన కవిత్వాన్ని ప్రాణవాయువుగా ప్రపంచంలో నింపాలని తపించిన కవి అలిశెట్టి ప్రభాకర్ అని తెలిపారు. అలాంటి వ్యక్తి సమగ్ర సాహిత్యం నవతెలంగాణ బుక్ హౌస్ ప్రచురించిదని గుర్తుచేశారు. అనంతరం నగర సహాయకార్యదర్శి రామకృష్ణ చంద్రమౌళి నిర్వహణలో కవిసమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర నాయకులు శరత్ సుదర్శి, ఎం.రేఖ, ముజాహిద్, పేర్ల రాము, కవులు ఇందిర వెల్ది, రవీంద్ర, శివచరణ్, సుధా, కోదాటి అరుణ, రవీంద్ర, నాగేశ్వరరావు, దేవాదీనం తదితరులు పాల్గొన్నారు.