Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబ్నగర్
హింద్వేర్ హోమ్ ఇన్నోవేషన్ లిమిటెడ్, గ్రూపే అట్లాంటిక్ కంపెనీ కలిసి జడ్చర్లలో గీసర్ల తయారీ ప్లాంట్ను ప్రారంభించాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హింద్వేర్ హోమ్ ఇన్నోవేషన్ చైర్మన్ సందీప్ సోమనీ, గ్రూపే అట్లాంటిక్ సీఈవో పైర్రె లూయిస్ ఫ్రాంకోసిస్ పాల్గొన్నారు. ఈ ప్లాంట్లో రూ. 210 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఆరు లక్షల యూనిట్లను తయారు చేయడమే లక్ష్యంగా 5.7 ఎకరాల్లో ఈ ప్లాంట్ను నిర్మించారు.
ఈ తరుణంలో 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భవిష్యత్లో మరో ఫేజ్లో రూ. 100 నుంచి 150 కోట్ల పెట్టుబడులు పెడుతామని కంపెనీ ప్రకటించింది. ఈ కంపెనీ సామర్థ్యం విస్తరించిన తర్వాత 12 లక్షల యూనిట్లను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుంటామని తెలిపారు.