Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఢిల్లీ నుంచి పుణె వెళ్తున్న స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ క్రమంలో విమానంలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 6:30 గంటలకు ఫోన్ చేసి తెలిపారు. ఈ తరుణంలో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా బాంబ్ స్క్వాడ్, ఎయిర్‌లైన్ అధికారులు కలిసి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు స్పష్టం చేశారు.